![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -631 లో... సుభాష్ దగ్గరికి కావ్య వచ్చి.. మీరేదో ఒకటి చేసి చిన్న మావయ్యని కోర్ట్ కి వెళ్లకుండా ఆపండి అంటూ రిక్వెస్ట్ చేస్తుంది. చేసిందంతా చేసి ఇప్పుడు ఇలా మాట్లాడితే ఎలా అని అపర్ణ కావ్యపై విరుచుకుపడుతుంది. ఏం అడిగినా ఈ కుటుంబం కోసం అంటావ్ కానీ అసలు ఏంటని చెప్పవని అడుగుతుంది. ఏది అయితే అది అవుద్ది ఇక్కడ నుండి వెళ్ళమని అపర్ణ కఠినంగా మాట్లాడడంతో కావ్య అక్కడ నుండి వెళ్ళిపోతుంది. పరిస్థితి మన చెయ్ జరిపోయిందని కావ్యతో రాజ్ అంటాడు. ఇంట్లో జరుగుతున్న వాటికి ఇద్దరు బాధపడతారు.
ఇంట్లో ఇక చిచ్చు రాజుకుంది.. ఆస్తులలో మనకి వాటా వస్తుందంటూ రాహుల్ , రుద్రాణి హ్యాపీగా ఫీల్ అవుతూ డ్రింక్ చేస్తూ డాన్స్ చేస్తుంటారు. అప్పుడే స్వప్న వచ్చి.. ఏం చేసిన మీకు ఆస్తులలో వాటా రాదంటూ డిస్సపాయింట్ గా మాట్లాడుతుంది. అయినా వాళ్ళు అదేం పట్టించుకోకుండా చిల్ అవుతారు. ప్రకాష్ ఇంట్లో వాళ్ళని ఎదిరించానని బాధపడుతుంటే ధాన్యలక్ష్మి వస్తుంది. కాసేపట్లో లాయర్ వస్తున్నాడని చెప్తుంది. ఇప్పటికే ఇంట్లో వాళ్ళు బాధపడుతున్నారు వద్దని ప్రకాష్ అంటాడు. అలా ఏం ఆలోచించకండి అని ప్రకాష్ ని కిందకి తీసుకొని వెళ్తుంది ధాన్యలక్ష్మి. అప్పుడే లాయర్ వస్తాడు. మేమే లాయర్ ని పిలిపించామని ధాన్యలక్ష్మి చెప్తుంది. తాత సంపాదించిన ఆస్తులలో వారసులుగా మనవళ్ళకి హక్కు ఉంటుంది కానీ వీళ్ళు కేసు వేస్తే మీరు ఎలా తీసుకున్నారని లాయర్ ని కావ్య అడుగుతుంది. అవును తన మనవళ్ళు వెయ్యాలని లాయర్ అంటాడు.
మేమ్ వేసింది చెల్లకపోతే నా కొడుకు చేత వేయిస్తానని ధాన్యలక్ష్మి అనగానే అప్పుడే కళ్యాణ్ ఎంట్రీ ఇస్తాడు. నేను వెయ్యనంటూ ముక్కుసూటిగా చెప్పేస్తాడు. తాతయ్య ఆ పరిస్థితి లో ఉంటే మీరు ఇలా చేస్తున్నారంటూ కోప్పడతాడు. నాన్న నీ బాధకి తప్పక ఒప్పుకున్నాడని ధాన్యలక్ష్మితో కళ్యాణ్ అంటాడు. నాకు ఆస్తులపై ఇష్టం లేదు.. నన్ను బలవంతం చేసే హక్కు మీకు ఎవరిచ్చారంటూ కళ్యాణ్ తన తల్లిని నిలదీస్తాడు. తరువాయి భాగంలో రాజ్ ఎవరితోనో కావ్య వీసా గురించి మాట్లాడతాడు. అది రుద్రాణి విని ధాన్యలక్ష్మికి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |